|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుద్యోగ యువతను అధిక వేతనాలతో విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపి సైబర్ నేరాలకు బలవంతం చేయిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు.
ప్రధాన నిందితుడు కోలనాటి నాగశివపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో BNS సెక్షన్లు, IT యాక్ట్ 66(D), ఎమిగ్రేషన్ యాక్ట్ సెక్షన్ 24 కింద నేరాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
నిందితుడు యువత పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు బలవంతం చేసేవాడని దర్యాప్తులో బయటపడింది. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నడిపిస్తోందని పోలీసులు తెలిపారు.
తాజాగా, కోలనాటి నాగశివపై పి.డి యాక్ట్ ప్రయోగించి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇకపై యువతను మోసం చేసే సైబర్ నేరగాళ్లను కఠినంగా ఎదుర్కొంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, హెచ్చరించారు.








