నిజామాబాద్ : 1000 లీటర్ల కల్లు స్వాధీనం : నిర్వాహకుడు అరెస్టు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ సింధు శర్మ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠెశ్వర్ ప్రాంతంలో ఉన్న కల్లు డిపో పై పోలీసుల దాడి నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది క్రమంగా ఈ దాడిని చేపట్టారు.

అక్రమంగా నిల్వ ఉంచిన 1000 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని అనంతరం డిపో నిర్వాహకుడు బండారు రవి గౌడ్‌ను అరెస్టు చేసి, తదుపరి చర్యలు చేపట్టేందుకు మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సైకి అప్పగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment