- || దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట తండాలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం రాత్రి గ్రామంలో ఒక వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించడని బాలిక కుటుంబ సభ్యులు రెడ్యానాయక్ అనే వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రెడ్యానాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ సంఘటన తర్వాత శుక్రవారం ఉదయం మృతుడి బంధువులు గ్రామంలో ఆందోళనకు దిగడంతో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు అప్రమత్తమై బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు.

పోలిస్ బలగాల మోహరింపుతో గ్రామంలో పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి వచ్చాయి, దాడి చేసిన బాలిక కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంబించినట్లు సమాచారం.








