ధర్పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎం. కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో, ధర్పల్లి నివాసి దుబ్బాక అరుణ్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు.

పోలీసుల చెక్‌లో అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో, ఈరోజు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు అతనికి 7 రోజుల జైలు శిక్ష విధించింది. శిక్ష ఖరారు కావడంతో అరుణ్‌ను జైలుకు తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment