అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం – నిర్మాణం నిలిపివేసిన అధికారులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పరిధిలోని జానకంపేట్ గ్రామ శివారులో అశోకసాగర్ ఉద్యానవనం ముందు అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సరైన నిర్మాణ అనుమతులు లేకుండా వాణిజ్య దుకాణ సముదాయల కోసం నిర్మాణం చేపట్టినట్లు సమాచారం.
స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించి, నిర్మాణ పనులను నిలిపివేశారు. అనుమతులు లేని ఈ నిర్మాణం నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారికి అత్యంత సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో భవిష్యత్తులో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు కూడా ఈ నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీ, మరియు ఆర్ & బీ శాఖ కలిసి సమన్వయం చేసుకొని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ పౌరులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment