మహారాష్ట్రకి అక్రమంగా పిడి‌ఎస్ రైస్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్ స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ నుండి అక్రమంగా పిడి‌ఎస్ రైస్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అర్థరాత్రి సమయంలో AP 29 T 9473 నంబర్ గల డీసీఎం వాహనంలో తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని అదుపులోకి తీసుకుని పరిశీలించగా వాహనంలో 74 పిడి‌ఎస్ రైస్ బ్యాగులు ఉన్నాయని గుర్తించారు.

ఈ వాహనాన్ని షేక్ అబ్బాస్ అనే వ్యక్తి నిజామాబాద్ నుండి మహారాష్ట్ర వైపు తీసుకెళ్తున్నాడని, పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులోని 74 పిడి‌ఎస్ రైస్ బ్యాగులను రిపోర్ట్ చేసిన వెంటనే పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. అక్రమంగా పిడి‌ఎస్ రైస్ తరలింపు జరుగుతున్నట్లు ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment