వర్నిలో టాస్క్ ఫోర్స్ పేకాట స్థావరంపై దాడి, 10 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ఎస్‌ఐ గోవింద్ మరియు వారి సిబ్బంది సంయుక్తంగా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్టిగుట్ట తండా శివారులో జాకోర అడవి ప్రాంతంలో పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 58,310 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పేకాటలో ఉపయోగించిన సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని వర్ని ఎస్‌హెచ్‌ఓకి అప్పగించి వారిపై మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

నిజామాబాద్ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment