|| దృశ్యం న్యూస్ ||
మంగళవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇది MLC ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనగా గుర్తించబడింది.
నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ సింధు శర్మ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, టాస్క్ పోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ గ్రామంలోని బెల్ట్ షాపు పై దాడి చేశారు.
ఈ దాడిలో 46 కింగ్ ఫిషర్ బీర్లు, 12 నాకౌట్ బీర్లు, రాయల్ స్టాగ్, గుడ్ డే, ఓల్డ్ అడ్మిరల్, రాయల్ గ్రీన్, ఆఫీసర్ ఛాయిస్, మెక్ డొనల్డ్, మ్యాజిక్ మోమెంట్ వంటి విభిన్న మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిల్స్ మొత్తం విలువ 18,590/- రూపాయలు.
బెల్ట్ షాపు నిర్వాహకుడు జె.ప్రణయ్ గౌడ్‌ను తదుపరి చర్యల కోసం ఆరవ టౌన్ పి.ఎస్ ఎస్సైకి అప్పగించారు.
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనను అరికట్టడం, మద్యం అక్రమ సరఫరాను నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకొని పోలీసులు తనిఖీలు చేపడుతూనే ఉన్నారు.








