ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి ఓ వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ ||

శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో 23 ఏళ్ల తెడ్డు శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. శ్రీకాంత్ ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎడపల్లి మండల పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్టర్ డ్రైవర్ సిరివెని రవి ట్రాక్టర్ తో అదే మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో శ్రీకాంత్ లిఫ్ట్ అడిగి ట్రాక్టర్ ఎక్కినట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మృతుడి తల్లి అయిన తెడ్డు సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment