|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ రమేశ్ అందించిన సమాచారం ప్రకారం, సోమవారం తెల్లవారుజామున మహమ్మద్ కాశీం ( 71 ) S /O సాయబ్ హుస్సేన్ అనే వ్యక్తిని ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందాడు.
ఎడపల్లి మండలం ఎమ్మెసీఫారం గ్రామంలో తన ఇంటి పక్కన కాలకృత్యాల కోసమై రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు.

మృతుడికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు, ఈ సంఘటనతో గ్రామంలో విషధచాయలు నెలకొన్నాయి.
ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం స్థానిక అధికారులు విచారణ చేపట్టారు.








