|| దృశ్యం న్యూస్ ||
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. అధికారులు, రక్షణ సిబ్బంది, పోలీసు విభాగం ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.

బీబీపేట చెరువు కట్ట తెగిపోయి ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు, తక్షణమే చెరువు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రజలను తుజాల్పూర్ ప్రభుత్వ పాఠశాల భవనాలకు తరలించి రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది నిరంతరం ప్రజల కోసం సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం 100, 08468-220069, లేదా 8712686133 నంబర్లను సంప్రదించవచ్చు అని తెలిపారు.








