ఎరువుల గిడ్డంగులను పరిశీలించిన కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి – ధర్పల్లిలో ఆకస్మిక తనిఖీ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నజీపేట్ గ్రామంలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కలెక్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రంతో పాటు ఎరువుల గోదాములను పరిశీలించారు. గిడ్డంగుల్లో స్టాక్ రిజిస్టర్లు, నిల్వల పరిస్థితిని వివరంగా పరిశీలించారు. రైతులకు అవసరమైనంతగా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సకాలంలో సరఫరా జరగకపోతే రైతులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment