సిరికొండ: గడ్కోల్‌ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనం నిర్మాణానికి భూమిపూజ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కోసం నూతన భవనం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ముగ్గువేసి శుభారంభం చేశారు. అంగన్వాడీ భవనం మంజూరుకు సహకారం అందించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, వెలమ భాస్కర్ రెడ్డికి స్థానికులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏయంసీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, నాయకులు గొల్ల లింబయ్య, భాను చందర్ రెడ్డి, జె. భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి, అఖిల్, హేమత్ తలారి, నిమల నవీన్, జె. భాషంత్, అంగన్వాడీ టీచర్, రవి నాయక్, జీవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ఇదొక శుభ సూచకంగా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment