|| దృశ్యం న్యూస్ ||
పిట్లం మండల తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వోకు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత నల్లాల వినయ్ కుమార్, ఎస్సిఎల్ అధ్యక్షుడు గాండ్ల మహేందర్, కొక్కుల ప్రవీణ్, గాండ్ల నరేష్ తదితరులు పాల్గొని ఎమ్మార్వోకు శాలువాతో సత్కారం చేసి, పూలమాలలు వేసి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్థానిక నాయకులు ఆకాంక్షించారు.








