|| దృశ్యం న్యూస్ ||
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.

గ్రామంలో 125 మందికి ఇండ్లు మంజూరు కాగా, 25 మంది మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారని అధికారులు తెలిపారు. మిగతా లబ్ధిదారులు కూడా త్వరగా నిర్మాణాలు ప్రారంభించేందుకు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్దేశిత గడువులోపు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
బాలికల రెసిడెన్షియల్ పాఠశాల తనిఖీ.

అదేవిధంగా, ఎడపల్లి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను పరిశీలించి బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులు, వంట నూనె తదితర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు.

కిచెన్ నిర్వాహకులు వండిన అన్నం మెత్తగా అవుతోందని తెలియజేయగా నాణ్యమైన బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు మాంసాహార భోజనం అందించాల్సిన సందర్భంలో చికెన్ స్థానంలో మటన్ అందిస్తున్నారని ప్రిన్సిపాల్ గంగాశంకర్ తెలిపారు. దీనిపై కలెక్టర్ సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ తనిఖీల్లో గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.








