బ్యాంక్ గ్యారంటీలు వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ ||

సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ రైస్ మిల్లర్లు, బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఖరీఫ్ 2024-25, రబీ 2023-24 సీజన్‌లలో సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయడంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు ఖరీఫ్ 2024-25 సీజన్‌లో బ్యాంక్ గ్యారంటీల జారీపై దృష్టి సారించామని తెలిపారు. జిల్లాలో 94 రైస్ మిల్లులు గడువులోపు సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని సూచిస్తూ, బ్యాంకర్లు గ్యారంటీల మంజూరును వేగవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరా అధికారి సురేష్ రెడ్డి, డిఎం సివిల్ సప్లై ఎస్. జగదీష్, ఎల్‌డిఎం నరసింహమూర్తి, సంబంధిత బ్యాంకర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment