ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించి, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విలేకరులతో మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 670 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈసారి సన్న రకం, దొడ్డు రకం ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని సామగ్రి అందుబాటులో ఉందని తెలిపారు, కనీస మద్దతు ధరతో పాటు, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందజేయనున్నట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వేగంగా నిర్దేశిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు, సంఘ నిర్వాహకులు, డైరెక్టర్లు రైతులు, గ్రామ పెద్దలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment