నిజామాబాద్‌లో 75 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం – టాస్క్ ఫోర్స్ ఆపరేషన్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడితో అక్రమ రవాణాను అడ్డుకున్నారు, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, ACP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన దాడిలో 75 క్వింటాళ్ల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కొజ్జా కాలనీలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తిగా లోడైన బొలెరో వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా 2,45,000/- విలువ చేసే PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం వన్ టౌన్ SHOకి అప్పగించారు. పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment