|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రానికి గజ్జవరపు వీరవెణి (64) ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎం ఈ ఓ పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే వీరవేణి ఆమె భర్త లోకం సాంబ శివరావు మరణం అనంతరం, అతనికి చెందిన 9 ఎకరాలు 24 గుంటల భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించగా, ఆ భూములు అప్పటికే మోడుగుల అనిల్‌రెడ్డి, విజయలక్ష్మి, కర్రొల్ల లక్ష్మణ్ తదితరుల పేర్లపై నకిలీ పత్రాలతో రిజిస్టర్ అయినట్లు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
భూమి యజమాని సాంబశివ రావు హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఆసుపత్రి లో మృతి చెందితే వర్ని గ్రామ పంచాయితీ లో నకిలీ మరణ ధృవపత్రం సృష్టించి, తప్పుడు రీతిలో భూమిని తమ పేర్లపై రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.
గుంటూరు జిల్లాకు చెందిన గోవర్ధన్ రెడ్డి సాంబశివరావు ఈ తొమ్మిది ఎకరాల భూమిని తనకు విక్రయించాడని బోధన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్దలతో చర్చించాలని భావించి ఆలస్యం జరిగిందని, కానీ నిందితులు బెదిరింపులు ఇచ్చినందున ఫిర్యాదు చేయడం ఆలస్యమైందని వివరించారు.
వర్ని పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మహేష్ కేసు దర్యాప్తు చేపట్టారు.








