పంట కాలువలో మహిళ మృతదేహం – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) ఏప్రిల్ 1, 2025 సాయంత్రం నిజామాబాద్ వెళ్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది అని, అయితే గురువారం రోజున ఆమె మృతదేహం గ్రామానికి సమీపంలోని పంట కాలువలో లభ్యమైంది అని,

ఈ ఘటనపై లక్ష్మీ సోదరుడు పురిమేటి నాగయ్య ఎడపల్లి మండల పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి మరణానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment