ధర్పల్లి మండలంలో స్కూటీ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీకి నిప్పు పెట్టి దహనం చేసిన సంఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే, ధనలక్ష్మి మెడికల్ యజమాని దాసరి ప్రసాద్ శనివారం రాత్రి తన స్కూటీ పెప్‌ను షాపు పక్కనే ఉన్న గల్లీలో పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. అయితే రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో స్కూటీ మంటల్లో దహనమవుతుందనే స్థానికుల సమాచారం అందగానే ప్రసాద్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. అప్పటికి స్కూటీ పూర్తిగా కాలిపోయిందని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సమాచారం అందుకున్న ఎస్సై ఎం.కళ్యాణి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో మండలంలో భయబ్రాంతులు నెలకొన్నాయి, దుండగులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment