|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే వారు ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు నిర్వహించారు.
మృతుడి వ్యక్తిగత వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, మృతికి గల కారణాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సమాచారాన్ని సేకరిస్తూ, సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎవరికైనా సంబంధిత సమాచారం తెలిసినట్లయితే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.








