భార్య మరణం తాళలేక భర్త ఆత్మహత్య – వర్ని మండలంలో విషాదం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అంబం గ్రామానికి చెందిన యువకుడు ఎరుకల పోశెట్టి (25) తన భార్య అనిత (వయస్సు 23) మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి లోనయ్యాడు. అనిత అనారోగ్యంతో 20 రోజుల క్రితం మృతి చెందడంతో అప్పటి నుండి తీవ్ర దిగులులో ఉన్న పోశెట్టి, వడ్డేపల్లిలో తన నివాస సమీపంలోని మామిడి చెట్టుకి నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటనపై బాధితుడి అన్న ఎరుకల మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో, వర్ని ఎస్‌ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment