|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పంట పొలంలో విద్యుత్ షాక్ గురయ్యారు.
ఈ విషాద ఘటన పెగడపల్లి గ్రామ శివారులోని పంట పొలంలో చోటుచేసుకుంది. ఓర్సు గంగారం, కొడుకు కిషన్, భార్య బాలమణి విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు బోధన రూరల్ ఎస్సై మచ్చంధర్ రెడ్డి, సిఐ విజయ్ బాబు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పంచనామా కోసం బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటన స్థానికులలో విషాదాన్ని నెలకొల్పింది. విద్యుత్ తీగలు భయంకర ప్రమాదాలు కలిగించవచ్చు కాబట్టి ఈ సంఘటన తర్వాత స్థానిక అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.








