|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి దొంగతనాలపై అలజడి నెలకొంది.
ఈ ఘటనలో కొంతమంది దొంగలు రాడ్లతో షట్టర్లను ధ్వంసం చేసి రెండు వ్యాపారాలైన కిరాణా షాప్ మరియు పెయింట్స్ షాప్‌లలో చొరబడి భారీగా దోచేశారు.
రెండు దుకాణాలలో దొంగతనానికి పాల్పడిన నలుగురు ముసుగు ధరించిన వ్యక్తులు, పెయింట్ షాప్‌లో 30,000 రూపాయలు, షాప్‌లోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌ను కూడా అపహరించారు.
ఈ ఘటనపై బాధితులు పోలీసుల వద్ద ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనపై వర్ని మండల్ ఎస్సై కృష్ణ కుమార్ మాట్లాడుతూ, ఈ దొంగతనాన్ని బాగా పరిశీలించి బాధితులకు తగిన న్యాయం అందిస్తామని తెలిపారు.
స్థానికులు ఈ దొంగతనాలను తీవ్రంగా ఖండించారు మరియు ఈ తరహా ఘటనల్ని నివారించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.








