అర్ధరాత్రి కారుకు నిప్పు పెట్టిన దుండగులు… ప్రజల్లో భయం – పోలీసులపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో మళ్లీ అగ్నికాండ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి సబ్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన చెలిమిల రంజిత్‌కి చెందిన మహేంద్ర XUV కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ధర్పల్లిలో ఇటీవలి రోజుల్లో వరుసగా జరిగే దహన ఘటనలలో ఇది మూడోది. కొన్ని రోజుల క్రితం నాలుగు బైకులు దహనమైన సంఘటనకు మచ్చుకు మసికరించక ముందే మరో ఘటన జరగడం ప్రజల్లో భయాందోళనలు పెంచింది.

 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ధర్పల్లి ఎస్సై ఎం. కళ్యాణి రాత్రివేళలోనే సంఘటన స్థలానికి చేరుకుని, వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించి మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు.

అయితే, వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ నిందితులు ఇంకా పట్టుబడకపోవడంతో స్థానికులు పోలీస్ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తు, పకడ్బందీ చర్యలతో దుండగులను వేగంగా పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ మరింత కఠినంగా వ్యవహరించాలని స్థానికుల అభిప్రాయం.

Join WhatsApp

Join Now

Leave a Comment