నసురుల్లాబాద్ చెరువులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ ||

సోమవారం ఉదయం నసురుల్లాబాద్ చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభించింది.

లభించిన మృతదేహం యొక్క వివరాలను పోలీసులు తెలియచేసారు.
వయస్సు: 30 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, ఎత్తు సుమారు 5.3 అడుగులు, రంగు తెలుపు,
దుస్తులు లేత ఆకుపచ్చ రంగు చొక్కా & ముదురు నీలం రంగు నైట్ పాయింట్, దానిపై “Messi” అనే ఇంగ్లీష్ పదం రాయబడి ఉంది అని
కుడి చేతికి రంగురంగు దారాలు కట్టబడి ఉన్నాయి అని తెలిపారు.

ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తించినట్లయితే లేదా సంబంధిత సమాచారం తెలిసినట్లయితే, స్టేషన్ హౌస్ ఆఫీసర్, నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ ను తక్షణమే సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment