వర్ని మండలంలో విషాదం: ఈత నేర్చుకుంటుండగా బాలుడు మృతి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బర్దవాల్ తాన్ సింగ్ S/o రామ్ చంద్ గురువారం ఉదయం స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనపై తండ్రి రామచంద్ వర్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వర్ని SI మహేష్ మాట్లాడుతూ, వేసవిలో పిల్లలు బావులు, కాలువల్లో ఈతకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉండటంతో, తల్లిదండ్రులు లేదా నిపుణుల పర్యవేక్షణలోనే పిల్లలను ఈత నేర్చుకోవడానికి పంపాలని కోరారు. ఇలాంటి విషయాల్లో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment