ఏసీబీ వలలో టేక్మాల్ ఎస్‌ఐ రాజేష్‌ – టపకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా టేక్మాల్ రక్షక భట నిలయంలో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ రాజేష్ రూ.30,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడటం స్థానికంగా సంచలనం రేపింది. ఇప్పటికే లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులో నోటీసులు జారీ చేస్తానని చెప్పి లంచం కోరినట్లు ఫిర్యాదుదారు తెలిపారు.

ACB అధికారుల రాకను గమనించిన ఎస్సై రాజేష్, తన వద్ద ఉన్న లంచం మొత్తంతో పారిపోవడానికి యత్నించగా వ్యవసాయ పొలాల్లో వెంబడించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం సొమ్ము సహా పక్కా సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటన బయటపడడంతో స్థానిక ప్రజలు టపకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని ద్వారా ఎస్సై రాజేష్ స్థానికులను ఎంతగా వేధించాడో అర్థమవుతోందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి అవినీతి చర్యలను అరికట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, లేదా ప్రజల నుండి ఇలాంటి అవమానియ ఘటనలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రముఖులు హెచ్చరిస్తున్నారు

ప్రభుత్వ ఉద్యోగి ఎవరికైనా లంచం కోరితే వెంటనే టెలంగాణ ACB టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని లేదా WhatsApp: 9440446106 ద్వారా సంప్రదించవచ్చును తెలుపుతూ, ACB అధికారులు ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment