టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడి: ₹80,000 విలువైన పిడిఎస్ బియ్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్‌ జిల్లా భోధన్‌ పట్టణంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్‌ బియ్యం గోదాంపై దాడి చేశారు.
గురువారం నాడు నిజామాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య ఆధ్వర్యంలో స్పెషల్‌ టీం, భోధన్‌ పోలీసులతో కలిసి ఈ దాడిని నిర్వహించారు.

భోధన్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అనిసనగర్‌లోని చర్చి వెనుక గోదాములో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 2.5 టన్నుల పిడిఎస్‌ బియ్యం, అంచనా ప్రకారం ₹80,000 విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోలీసులు గోదాం యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం భోధన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ సీఐకు అప్పగించారు.
అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment