మెదక్: జూదంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి – నలుగురు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కుల్చారం మండలం యెనగండ్ల గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం భారీ జూద దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. దాడిలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, రూ.16,712/- నగదు, 4 మొబైల్ ఫోన్లు, 52 ఆట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కుల్చారం పోలీస్ స్టేషన్‌కు తరలించి, చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో జూదం, బెట్టింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment