|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్రచారి నేతృత్వంలో, ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సైలు గోవింద్, శివరాం బృందం టౌన్-5 పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం 80 క్వాటర్స్ లోని వ్యభిచార గృహంపై దాడి నిర్వహించారు.
ఈ దాడిలో ఇద్దరు వ్యభిచార ఆర్గనైజర్లు, ఇద్దరు విటులు, ఐదుగురు విటురాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అదనంగా 9 మొబైల్ ఫోన్లు, రూ.93,250 నగదు, రెండు కండోమ్ ప్యాకెట్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని టౌన్-5 SHOకు అప్పగించి తదుపరి విచారణ చేపట్టారు.








