పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి: ₹1,01,250 నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, అదనపు DCP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, SIP గోవింద్ స్పెషల్ టీమ్‌తో కలిసి బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూర మండలంలో ఈ దాడిని చేపట్టారు.

ఈ దాడిలో 8 మంది పేకాటరాయిలను అరెస్ట్ చేసి, 09 సెల్‌ఫోన్లు, ₹1,01,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరంను పూర్తిగా విచ్చిన్నం చేసి, నిందితులను బోధన్ రూరల్ SHOకి అప్పగించారు.

ఈ దాడితో నేరపురిత కార్యకలాపాలకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment