దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి-కొడుకుల ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ ||

సంగారెడ్డి జిల్లా, అందోళ్ మండలం చింతకుంట గ్రామం నుండి దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి మరియు కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంఘటితమైంది.

ఆదివారం ఒక వ్యక్తి తన టాటా వాహనాన్ని చింతకుంట గ్రామంలోని ఖాళీగా ఉన్న ప్రదేశంలో నిలుపగా, అదే గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్ అనే వ్యక్తి ఆ వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ వాహనం బుజరంపేట గ్రామ శివారులో కాల్వలో ఇరుక్కుపోవడంతో అక్కడే వదిలివేశాడు.
ఈ విషయమై విచారణ ప్రారంభించిన వాహన యజమాని బుజరంపేట స్థానికులు చింతకుంట గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్ గా గుర్తించి, ఈ విషయమై బుజరంపేట గ్రామ పెద్దలు మంగళవారం శ్యామ్ తన తల్లిదండ్రులతో కలిసి పంచాయతీకి పిలువగా, శ్యామ్ మరియు అతని తల్లి బైకు పై ఇంటి నుండి బయలుదేరి మార్గమధ్యంలో శ్యామ్ మనస్థాపానికి గురై చింతకుంట బ్రిడ్జ్ పై బైక్ ఆపి మంజీరా నీళ్లలో దూకాడు, ఆపై అతని తల్లి కూడా నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషాద సంఘటనపై స్థానికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బుధవారం, శ్యామ్ మరియు అతని తల్లి బాలమణి మృతదేహాలు గజా ఈతగాలతో బయటకు తీయించి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment