|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఎల్ఐసి చౌరస్తా, దేవి రోడ్, పులంగ్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి.
ఆటో డ్రైవర్ల వాహన పత్రాలు చెక్ చేయడంతో పాటు, అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
అదేవిధంగా నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను అణచివేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన పహరా ఏర్పాటు చేశారు.








