పాఠశాల వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు: నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న యాజమాన్యం.

|| దృశ్యం న్యూస్ ||

పాఠశాల వాహనాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహన పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సీట్లలో అధిక సంఖ్యలో విద్యార్థులు కూర్చోవడం వంటి ప్రమాదకర ప్రయాణ పరిస్థితుల వల్ల ఎన్నో ప్రమాద సంఘటనలు ఏర్పడుతున్నాయి. నిజామాబాద్ రూరల్ సారంగపూర్ గ్రామంలోని మేఘ ఉన్నత పాఠశాల నిర్వాహకుల తీరు అలాగే వుంది, ఈ పాఠశాల వాహనాల్లో ముగ్గురు విద్యార్థులు రెండు సీట్లలో కూర్చోవడం, కొందరు విద్యార్థులు సీట్ల మధ్యలో మరియు డ్రైవర్ పక్కన నిలబడడం వంటి ప్రమాదకర పరిస్థితులలో విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు.

ఈ విషయంలో సంబంధిత అధికారులు, విద్యాశాఖ లేదా రోడ్డు భద్రత విభాగం పట్టించుకోకపోవడం వల్ల పిల్లల తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తోంది.
విద్యార్థుల చదువు గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి వారి తల్లిదండ్రులు మౌనం పాటిస్తూ, ఇలాంటి విషయాలపై ప్రశ్నించలేకపోతున్నారు.

ఇకనైనా విద్యార్థుల భద్రత పై పాఠశాల యాజమాన్యం, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో వారు తమ వైఖరిని మార్చుకుంటారో లేదో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment