విద్యార్థిని చితకబాదిన ప్రైవేట్ పాఠశాల టీచర్ – తల్లిదండ్రుల ఆందోళన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్‌లో ఉన్న వాణి విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి అరవ్ సింగ్‌పై టీచర్ స్వప్న దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.

పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో టీచర్ చిన్నారిని గత కొన్ని రోజులగా మానసికంగా హింసిస్తున్నట్టు, బుధవారం రోజు బాలుడిపై విచక్షణ రహితంగా దాడి చేసింది అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీచర్ ప్రవర్తనపై పలుమార్లు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లవాడు పాఠశాలకు వెళ్లాలన్న భయంతో ఏడుస్తున్నాడని, తన భద్రతకు ముప్పుగా భావిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక స్కూల్ రోజులు నాలుగు మాత్రమే మిగిలి ఉన్నాయి అని, వేసవి సెలవులు రబోతున్నాయని ఈ విషయం వదిలేయండని బాలుడి తల్లితండ్రితో యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందించడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు, అరవ్ తల్లిదండ్రులు, స్థానికులు బాలల హక్కుల కోసం సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment