కామారెడ్డి: జూదంపై కఠిన చర్యలు — 469 మందిపై కేసులు, రూ.10.40 లక్షల నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు సుదీర్ఘ నిఘా కొనసాగిస్తున్నారు. అక్రమ పేకాట (జూదం) ఆడిన వారిపై ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
అక్టోబర్ 18 నుండి 21, 2025 వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 82 కేసులు నమోదు చేసి 469 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹10,40,089 నగదు, 321 మొబైల్ ఫోన్లు, 45 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ — “పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి, కుటుంబం, సమాజానికి హానికరం అని, ఇవి అప్పులు, ఆర్ధిక నష్టం, కుటుంబ విభేదాలు, ఆత్మహత్యల వరకు దారితీస్తాయి అని, ప్రతి పౌరుడు ఇటువంటి అక్రమ కార్యకలాపాల నుండి దూరంగా ఉండి, సమాజ శాంతి భద్రతకు తోడ్పడాలి” అని హెచ్చరించారు.

అలాగే గ్రామాలు, పట్టణాలు, ఇళ్లు లేదా పామ్ హౌసుల్లో జూదం జరుగుతున్నట్లయితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 86133 లేదా 100 డయల్ చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
పేకాట స్థావరాలపై నిఘా కొనసాగుతుంది, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు అని ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment