|| దృశ్యం న్యూస్ ||
మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగింది.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు నిఘా ఉంచి కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచి జైలుకు పంపించే చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజలందరూ మద్యం తాగి వాహనాలు నడపరాదని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కు చెక్ పెట్టి, ప్రమాదాలను నివారించాలని పోలీసులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.








