|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సీసీఎస్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య, టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది పట్టణంలో గల కైట్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 20 బెండల్స్ చైనా మంజా స్వాధీనం చేసుకోగలిగారు. ఈ చైనా మంజా మొత్తం విలువ 10,000 రూపాయలుగా ఉంటుందని నిర్ధారించారు.
ప్రాధమిక దర్యాప్తు తరువాత ఈ కేసు తదుపరి చర్య కోసం రెండవ పట్టణ స్టేషన్ ఎస్ఐ కి అప్పగించడం జరిగింది. ఈ దాడులతో షాపుల ద్వారా చైనా మంజా విక్రయాలు నిషేధం చేస్తూ ప్రజల రక్షణ కోసం కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.








