ఆత్మహత్యకు ప్రయత్నిచిన యువకుడిని కాపాడిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని అఫంది ఫారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ యువకుడి ఆత్మహత్య ప్రయత్న ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గూగులోతు శివాజీ (30) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఈ విషయం గమనించిన స్థానికులు 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో వర్ని పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్ సిబ్బంది అనురుద్, అజయ్ తక్షణమే స్పందించి ఘటన స్థలానికి వేగంగా చేరుకుని తలుపులు బద్దలుకొట్టి బాధితుడిని కాపాడారు. చాకచక్యంగా స్పందించిన పోలీసుల తక్షణ చర్యతో యువకుడి ప్రాణాలు రక్షించబడ్డాయి.

ఈ సందర్భంగా వర్ని ఎస్‌ఐ మహేష్ వీరి సేవలను అభినందించారు. పోలీసుల అప్రమత్తత బాధితుడి ప్రాణాలను కాపాడిన విధానం వల్ల స్థానిక ప్రజల ద్వారా కూడా ప్రశంసలు పొందారు.

Join WhatsApp

Join Now

Leave a Comment