|| దృశ్యం న్యూస్ ||
కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సూచనల మేరకు, కామారెడ్డి ASP బి. చైతన్య రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఉదయం 4 గంటలకే ప్రారంభమై 200 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల్లో మొత్తం 235 వాహనాలను స్వాధీనం చేసినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 224 ద్విచక్ర వాహనాలు, నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగిన 27 బైకులు, రవాణా నియమాలు ఉల్లంఘించిన 11 ఆటోలు ఉన్నాయి. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు చెప్పారు.
వాహనదారులు వాహన దృవపత్రాలు తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని, గంజాయి–మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతోందని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి ప్రజలు వాటి ఏర్పాటు కోసం ముందుకు రావాలని ASP చైతన్య రెడ్డి సూచిస్తూ, రాత్రి వేళల్లో ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరగరాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి, రూరల్–భిక్నూర్–సదాశివనగర్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.








