నిజామాబాద్: అక్రమ వీసా ఏజెంట్ల అరెస్ట్ – 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వీసా మోసం చేసే ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరు నిరుద్యోగ యువతను “డేటా ఎంట్రీ ఆపరేటర్” ఉద్యోగాల పేరుతో మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసి థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

అరెస్టయిన ఏజెంట్ల వివరాలను పోలీసులు వెల్లడించారు,
అలకుంట సంపత్ – శ్రీరామ్ ఇంటర్నేషనల్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ మేనేజర్, పెద్దపల్లి.
దండుగుల చిరంజీవి – శ్రీరామ్ ఇంటర్నేషనల్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ మేనేజర్, జగిత్యాల.
మిట్టపల్లి నర్సారెడ్డి – జగిత్యాల జిల్లాలకు చెందిన వ్యక్తులుగా తెలిపారు.

విదేశాల్లోని భారత రాయబార కార్యాలయ సహాయంతో ఇద్దరు బాధితులు తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో నిజామాబాద్ జైలుకు తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment