|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం విరన్నగుట్ట గ్రామానికి చెందిన అభినయ్ గౌడ్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన చిన్ను అలియాస్ ఆంజనేయులు అనే వ్యక్తి బండ రాయితో తలపై దాడి చేసాడు. ఈ దాడి వల్ల అభినయ్ గౌడ్ కి తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే అభినయ్ రెంజల్ మండల పోలీసులను ఆశ్రయించడంతో అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అభినయ్ గౌడ్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ కారణం వల్ల గొడవ మొదలైందో ఇంకా విచారణ కొనసాగుతోంది.








