|| దృశ్యం న్యూస్ ||
TGSP కానిస్టేబుల్స్ చేస్తున్న నిరసనలకు మద్దతుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ధన్ పల్ మాట్లాడుతూ, పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉండగా వారు రోడ్డెక్కి ధర్నాలు చేపట్టేలా చెయ్యడం అన్యాయం అని పేర్కొన్నారు. ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం కఠినమైన విషయం అని తెలిపారు.
TGSP కానిస్టేబుల్స్ గత కొన్ని రోజులుగా ప్రాథమిక న్యాయపరమైన డిమాండ్లను చేస్తూ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్, పునర్విభజన వల్ల వారికి అన్యాయం జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. “ఈ పరిస్థితి వారి కుటుంబాలపై తీవ్రంగా ప్రభావితం చేస్తోంది అని, 39 కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేయడం, 10 మందిని డిస్మిస్ చేయడం సమంజసమైన విషయం కాదని.,
తమ వ్యక్తిగత జీవితాలను మనోవేదనను అర్ధం చేసుకోకుండా తీసుకున్న ఈ చర్యలను ఆయన పూర్తిగా ఖండించారు. TGSP కానిస్టేబుల్స్ న్యాయపరమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలి అని స్పష్టం చేశారు.
అలాగే, సస్పెండ్ చేసిన 39 మందిని, అలాగే డిస్మిస్ చేసిన 10 మందిని తిరిగి విధుల్లోకి తీసుకొని కృషి చెయ్యడానికి అవకాశం కల్పించాలన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ వారు అనుభవిస్తున్న కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు.








