నవిపేట్‌: సిల్వర్ మార్చంట్ షాప్‌లో భారీ చోరీ – పోలీసులు దర్యాప్తు కొనసాగింపు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో దొంగలు హల్‌చల్ చేశారు. స్థానిక వైష్ణవి సిల్వర్ మార్చంట్ షాప్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. సీసీ కెమెరా ఫుటేజీ ప్రకారం, ముగ్గురు దుండగులు రాత్రి సుమారు 3 గంటల సమయంలో పల్సర్ బైక్‌పై వచ్చి, గ్యాస్ కట్టర్ సహాయంతో షాప్ తలుపులు విరిచి లోపలికి చొరబడ్డారు. అనంతరం షాపులో ఉన్న భారీ మొత్తంలో వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న నవిపేట్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ బృందంతో కలిసి ఆధారాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.
దొంగలను గుర్తించేందుకు సీసీ కెమెరా వీడియోలను పరిశీలిస్తున్నారు. స్థానిక వ్యాపార వర్గాల్లో ఈ ఘటన ఆందోళన కలిగించింది. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునే దిశగా చర్యలు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment