|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా కేంద్రం, మహాలక్ష్మినగర్ లో 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి 5తులాల బంగారం, 20తులాల వెండి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై బాధితులు గురువారం ఉదయం 4వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.
పోలీసు ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఆధారాలను ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ స్టేషన్ పరిధిలోనే కొద్ది రోజుల్లోనే రెండవసారి చోరీ జరగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రకమైన చోరీలు తరచుగా జరుగుతున్నాయని ప్రజలు పోలీస్ శాఖ నుండి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కోరుకుంటున్నారు.








