పిడిఎస్ బియ్యం పట్టివేత: మాక్లూర్ మండల కేంద్రంలో మెరుపు దాడులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండల కేంద్రంలో ఉన్న పిడిఎస్ బియ్యం గోదాం పై సిసిఎస్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటళ్ల పిడిఎస్ బియ్యం పట్టుబడింది. ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడి ద్వారా సంబంధిత గోదాం నుండి బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన బియ్యం స్థానిక ఎస్ హెచ్ ఓ కు అప్పగించబడింది, అక్రమంగా నిల్వ ఉంచిన ఈ పిడిఎస్ బియ్యం మాములుగా ప్రభుత్వ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించబడతుంటే ఈ చర్యలకు పాల్పడినందుకు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment