బంగారం చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు – కరాటే రమేష్ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన బంగారం చోరీ ఘటనపై పోలీస్ శాఖ నిశ్శబ్దంగా ఉండటంపై ముదిరాజ్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ ముదిరాజ్, మండల కమిటీ అధ్యక్షులు మచ్చ రఘురామ్ ముదిరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కరాటే రమేష్ మాట్లాడుతూ – కుటుంబ సభ్యులను “విదేశాలలో కష్టపడి సంపాదించిన బంగారం దొంగతనం కావడం బాధాకరం అని, బతుకమ్మ పండుగ రోజున ఇలా జరగడం మరింత విచారకరం” అని పేర్కొన్నారు.

పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని సమగ్రంగా విచారణ చేపట్టాలని, దొంగలను తక్షణమే పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ “ఇందల్వాయి పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే, ఈ విషయం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం” అని కరాటే రమేష్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment