అక్రమ రేషన్ బియ్యం పట్టివేత – దౌల్తాబాద్

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదే గ్రామానికి చెందిన జోడు భిక్షపతి అనే వ్యక్తి తన ఇంట్లో ఈ రేషన్ బియ్యాన్ని ఇతరుల నుండి సేకరించి నిల్వ ఉంచినట్లు సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 17 సంచుల్లో నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.

ఈ ఘటనపై ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ మాట్లాడుతూ, జోడు భిక్షపతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచడం, రవాణా చేయడం, ఇతరులకు అమ్మడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిపిన వారికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment